భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త…

man tortured and killed his wife

Advertisements

&NewLine;<p> అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై తరచూ గొడవ పడేవారు&period; ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మద్యం తాగినందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ భార్య దేవి పై భర్త రవి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు&period; దాడిలో భార్య తలకు బలమైన గాయమైంది&period; స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు&period; విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దాడికి ఉపయోగించిన గొడ్డలిని దాడికి పాల్పడిన భర్త రవిని అదుపులోకి తీసుకున్నారు&period; ఈ సంఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..