జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కమలాపురం మూడు రోడ్ల కూడలి నుండి గ్రామ చావిడి వరకు వరకు సిఐ రామకృష్ణారెడ్డి.. ఎస్సై రుషికేశవరెడ్డి అధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కమలాపురం నియోజకవర్గం లోని అన్ని సమస్యాత్మక గ్రామాలు… ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటును స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారిలో మనస్తర్యాన్ని నింపేందుకు కేంద్ర బలగాలతో ఈ రోజు కమలాపురం టౌన్ లో కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి భరోసా కల్పించే నిమిత్తం ఈ కవాతు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు.
ఎస్సై ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు…
91
previous post