తిరుపతి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట పట్టణంలోని సెబ్ కార్యాలయంలో సెబ్ సీఐ RUVS ప్రసాద్, గూడూరు సెబ్ డీఎస్పీ జె రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గస్తీ నిర్వహించామన్నారు. నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు మూడులక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పటిష్టంగా చర్యలు చేపట్టినట్లు సెబ్ డీఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే సమాచారం అందించాలని ప్రజలను రమేష్ కోరారు.
Read Also..
Read Also..