కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం డిపో మేనేజర్ ప్రసాద్ కుటుంబ సభ్యుల వేధింపుల తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు లో నివాసం ఉంటున్న ఉయ్యూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ దంపతుల కుమారుడు ఫణి మాధవ్ విజయవాడ టౌన్ పడమటకు చెందిన శ్రీపతి శ్రావ్యకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కుమ్మిరెడ్డి మాధవ్ కు శ్రావ్య రెండో భార్య , మొదటి భార్య నుండి విడాకులు పొందిన మాధవ్ శ్రీపతి శ్రావ్యను కులాంతర వివాహం చేసుకున్నాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మాధవ్ తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది ఆమె వద్ద చదువుకున్న శ్రావ్యను కావాలని తన కుమారుడికి ఇచ్చి ప్రసాద్ దంపతులు వివాహం చేశారు.
ఒక వారం రోజుల క్రితం మాధవ్ సోదరుడికి ఈడుపుగల్లులో వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన వద్ద నుండి శ్రావ్య ను అత్తవారి ఇంట్లో సూటిపోటి మాటలు వేధింపులు ఎక్కువయ్యాయని ఇది భరించలేక శ్రావ్య గురువారం పెనమలూరు మండలం పోరంకి లోని సాలిపేటలో చెరుకు రసం కొనుగోలు చేసి అందులో ఎలుకల మందు కలుపుకొని సేవించింది. శ్రావ్య తన అత్తగారింటికి వచ్చింది విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకువెళ్లారు, అక్కడ వారు ఆమె బ్రతికే ఛాన్స్ లేదని తేల్చి చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అయినా శుక్రవారం సాయంత్రం శ్రావ్య వైద్యశాలలోనే మరణించింది.
ఇది చదవండి: నూజివీడులో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం
అయితే మరణించే ముందు శ్రావ్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిందని ఆ వాంగ్మూలంలో తల్లి అనారోగ్యం భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదు చేశారని ఇదంతా కల్పితమని తమ తల్లికి యాక్సిడెంట్ అయి చాలా రోజులైందిని ఆమె ఎప్పుడు రికవరీ కూడా అవుతుందని తమ తల్లి ఆరోగ్యం గురించి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది విషయం దాసి ప్రసాద్ కుటుంబ సభ్యులు తప్పించుకోవాలని చూస్తున్నట్లు మృతురాలి సోదరి సుమా మీడియాకు తెలిపారు.
పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి బాడీని ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.