113
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఎన్ఎఎఫ్సి యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో దట్టమైన పొగ కమ్మేసింది. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కోకోవెన్ యూనిట్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసి పడి అగ్నిప్రమాదానికి కారణంగా మారిందని తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, యంత్రాలు, అక్కడ ఉన్న మెటీరియల్ అంతా పూర్తిగా కాలిపోయాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.