మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ ప్రతిపాదన తీసుకురాగా భట్టి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలుచేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకు మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని, ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈసారి మేడారం జాతరకు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచే రెండు వేల సిటీ బస్సులను పంపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
మేడారం జాతర.. భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
68
previous post