వైఫల్యానికి గల కారణాలను మళ్లీ పరిశీలిస్తాం 

medigadda barriage bridge

Advertisements

&NewLine;<p>మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి&comma; నీటిని పూర్తిగా తొలగించిన… వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యాం సేఫ్టీ అథార్టీ తెలిపింది&period; ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ పేర్కొంది&period; జాతీయ అథార్టీ&comma; సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి&period;&period; వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది&period; నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది&period; ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథార్టీ తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖ రాసింది&period; మేడిగడ్డ బ్యారేజి కుంగడం&comma; పియర్స్‌ దెబ్బతినడంతో జాతీయ అథార్టీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే&period; ఇందులోని అంశాలతో నవంబరు ఒకటిన రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి&period;&period; కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి లేఖ రాశారు&period; ఇందులో డిజైన్‌&comma; నిర్మాణం&comma; నిర్వహణ&comma; నాణ్యతా లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను వివరంగా పేర్కొన్నారు&period; దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి&period;&period; బ్యారేజి కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సిందిపోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..