ప్రారంభమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తు పనులు…

Medigadda barrage repair work started...

Advertisements

&NewLine;<p>కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి&period; రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ ఈ పనులను మొదలుపెట్టింది&period; మొదటి దశలో 55 కోట్ల రూపాయల విలువైన కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలుస్తున్నది&period; గత రెండ్రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి&comma; రాళ్లు అడ్డుగా పొస్తోందని సమాచారం&period; పనులకు ఆటంకం కలగకుండా నీళ్లు ఆపేందుకు 7&comma; 8à°µ బ్లాక్‌à°² చుట్టూ ఈ కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తోందని సమాచారం&period; కాగా మేడిగడ్డ బ్యారేజీ 7à°µ బ్లా‌క్‌లోని పిల్లర్లు ‌‌‌‌ఈ ఏడాది అక్టోబర్‌లో కుంగుబాటుకు గురయ్యాయి&period; &OpenCurlyQuote;డిఫెక్ట్‌‌‌‌ లయబిలిటీ పీరియడ్‌‌‌‌’ 2022 జూన్‌‌‌‌ 29నే ముగిసిపోవడంతో మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ అండ్ టీ లేఖ ద్వారా గవర్నమెంట్‌ను కోరింది&period; అయితే అంతకుముందు మరమ్మత్తు పనులు తామే చేస్తామని ప్రకటించి మళ్లీ మాట మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది&period; ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం&period; కాగా పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తే బ్యారేజీ ఎంత మేరకు డ్యామేజీ జరిగిందనేది తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..