ప్రాణం పొయ్యడానికి కాదు…పోస్టుమార్టం చేయడానికి మాత్రమే

Minister Ambati Rambabu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత&comma; మాజీ సీఎంచంద్రబాబు&comma; ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది&period; మరికొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ బాబు&comma; పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది&period; ఈ క్రమంలో బాబు&comma; పీకే భేటీపై వైసీపీ సీనియర్ నేత&comma; మంత్రి అంబటి రాంబాబు స్పందించారు&period; ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిశోర్ పనికిరాడని&period;&period; చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు&period; గతంలో ప్రశాంత్ కిశోర్‌ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని విమర్శించారని గుర్తు చేశారు&period; కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్లీ అతడితోనే బాబు చేతులు కలిపాడని విమర్శలు గుప్పించారు&period; రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు&comma; లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండని అన్నారు&period; ఎంతమంది ప్రశాంత్ కిశోర్‌లు వచ్చినా&period;&period; ఎంతమంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా&comma; ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం మాత్రం అసాధ్యమని సెటైర్ వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..