‘మేమంతా సిద్ధం’ పేరిట సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారని తెలిపారు.. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని సజ్జల స్పష్టం చేశారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహిస్తామని తెలిపారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారన్నారు. ఇక మార్చి 28న నంద్యాలలో, మార్చి 29న కర్నూలులో, మార్చి 30న హిందూపురం లోక్ సభ స్థానాల పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుందని సజ్జల తెలిపారు.
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర…
121
previous post