కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు రైతుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వారి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు. ఈ విషయాన్ని రైతు సంఘం నాయకులు గుర్తించి వెంటనే పొలాల్లో అమర్చిన 25 మీటర్లను ధ్వంసం చేసారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీటర్లు బిగించడాన్ని ఏపీ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఉరితాలు బిగించినట్టేనని దీన్ని రైతులు వ్యతిరేకించాలని సూచించారు. ప్రభుత్వం మీటర్లు బిగించడాన్ని ఆపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న మీటర్లు..!
72
previous post