సింగరేణి లో ప్రారంభమైన మైన్స్ రెస్క్యూ పోటీలు..

Shyam Mishra

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ లోని సింగరేణి మైన్స్ రెస్క్యూ ప్రదాన కార్యాలయంలో 52 వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి&period; నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను భారత బొగ్గుగనుల భద్రతా విభాగం అదికారి శ్యామ్ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరై ప్రారంబించారు&period; పోటీలలో దేశంలోని కోల్ మైన్స్ కు చెందిన 16 జట్లు&comma; మెటల్ మైన్స్ కు చెందిన 9 జట్లు పాల్గొంటున్నాయి&period; ఈ సందర్భంగా డిఎంఎస్ శ్యామ్ మిశ్ర మాట్లాడుతూ దేశంలోని అన్ని కోల్ మైన్స్&comma; మెటల్ మైన్స్ కు చెందిన రెస్క్యూ బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని తెలిపారు&period; ప్రమాద సమయంలో అప్రమత్తత కోసం ఏటా దేశంలోని ఒక సంస్థలో ఆలిండియా రెస్యూ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు&period; ఈ సంవత్సరం హిందుస్థాన్ జింక్ సంస్థ నుంచి మహిళా జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..