మేడారం లాంటి పెద్ద జాతరలకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించడమనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోజువారి ప్రయాణికులతో పాటు, మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ నుండి అందుతున్న సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు. మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ల తో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు నెలకు పది పదిహేను వేయిలు ఇవ్వాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వాహనాల ఇంజన్ల పై ట్యాక్స్ ను నాలుగు వెయిల నుండి పదివేలకు పెంచారని ఈ సందర్భంగా మంత్రి ఎదుట ఆటో డ్రైవర్లు వాపోయారు.
హుస్నాబాద్ బస్ స్టాండ్ ను సందర్శించిన మంత్రి పొన్నం…
102
previous post