నంద్యాల జిల్లాలో మంత్రి రవీందర్ కారు ప్రమాదం(Minister Ravinder Car Accident)
ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారి పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్(Minister Ravinder) తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల జాతీయ రహదారి పై నెమ్మదిగా వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ఘటనలో రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29న బాల కిరణ్కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈనెల 3న శామీరేపేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు. 4న నూతన దంపతులను తీసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి