78
చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జిగా ప్రకటించారన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ నిలదీశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డినే అని ఇటీవల సీఎం తనను పిలిపించి ఎంపీగా పోటీ చేయాలని తెలిపారన్నారు. అందుకు తాను ఏం తప్పు చేశానని ఎందుకు ఎంపీగా పంపుతున్నారని అడిగానన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలను చెప్పాలని అడిగానన్నారు.