82
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. బోయిన్పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. హాస్పిటల్ యాజమాన్యం లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీసుకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.