ఇటీవల ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మార్కాపురం కు చెందిన నలుగురు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడారు.ఈ క్రమం లో కొందరు నాపై ఆరోపణలు చేయడం విచారకరం. దీనిపై వివరణ ఇవ్వాలని భావించానని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దరిమడుగు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కి,అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయని, ఇందులో నన్ను లాగడం మంచిపద్దతి కాదన్నారు. గ్రామ చెరువు దశాబ్దాల క్రితం నాటి అంశం అని అన్నారు. రామడుగు రమేష్ కు, మా పార్టీ కే చెందిన మరో వ్యక్తితో ఉన్న విభేదాలు అని అన్నారు. మా పార్టీ అంతర్గత వ్యవహారం అని దానిని మేం సరిచేస్తున్నామని తెలిపారు. పోరెడ్డి నాగిరెడ్డి విషయం లో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాగిరెడ్డి ద్వారా మోసపోయిన వారికి నేను మద్దతు ఇచ్చానని, చెప్పారు. పై విషయాల్లో నాకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవాలయ అభివృద్ధి నిధులు మీ పార్టీ వారే లెక్కలు చూస్తున్నారని, విచారణ చేసుకోవాలి అని సలహా ఇచ్చారు. భూ ఆక్రమాలలో ఎలాంటి పనైనా సిట్ ద్వారా పరిష్కారం చేసుకుందాం రా అని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ టీడీపీ నాయకులకు . సవాల్ విసిరారు.
నాపై ఆరోపణలు తగదు ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి…
81
previous post