పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ..

MLC Kancharla Srikanth visited the student

Advertisements

&NewLine;<p>ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబు పాముకాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును శుక్రవారం టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు&period; మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని&comma; అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు&period; తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో వేల పది మంది విద్యార్థులతో కళకళలాడిందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు&period; వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచిన అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు&period; విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు&period; ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునే వారిని ప్రశ్నించారు&period; పాము కరిచినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డెన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారన్నారు&period; తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీ కి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.