జీఓ నం.3 రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్:
భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) ఇందిరాపార్క్ ధర్నా చౌక్(Indirapark Dharna Chowk) వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీఓ నం.3 శరాఘాతంగా నిలుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) ఆరోపించారు. ఈ జీఓను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఈ జీఓ ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీఓ నం.41ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యక్తిగత కారణాలతో చనిపోయిన అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుందని ఆమె విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి