Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు…

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు…

by Prakash
P.Gannavaram shivayya temple

అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలం

పి గన్నవరం(P.Gannavaram) గరుడేశ్వర స్వామి ఆలయమునకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ మంతటా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. పి గన్నవరం గరుడేశ్వర స్వామి ఆలయమునకు(Garudeshwara Swamy Temple) మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారి దర్శనమునకు బారులు తీరిన భక్తులు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభువు గా వెలసిన శ్రీ గరుడేశ్వర స్వామి ఆలయమునకు ఒక ప్రత్యేకత ఉంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం విశిష్టత.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

పూర్వకాలమున ఒక గరుడ పక్షి ఒక శివలింగమును తీసుకొచ్చి వైనతేయ నది ఒడ్డున పడవేసిందని అది గమనించిన ఒక ముని అది అతి విశిష్టత కలిగిన శివలింగం అని ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చి జార విడిచింది అంటే ఇక్కడ ఏదో విశిష్టత ఉంది అని ఒక గరుడ తీసుకొచ్చిన లింగం కాబట్టి గరుడేశ్వర లింగంగా దానిని ప్రతిష్టించి అప్పటినుంచి ఇప్పటివరకు పూజలు హోమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సాక్షాత్తు పరమేశ్వరుడు గరుడచేత తన ప్రతిమను పంపినందుకుగాను ఈ గ్రామం నకు గరుడవరం అని కూడా పేరు ఉండేది కాలక్రమమైన అది గన్నవరం గా మారింది అని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ విప్పర్తి వేణుగోపాల్ రావు సతీసమేతంగా గరుడేశ్వర స్వామి దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని …
శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. …
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: