67
సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల నడుమ 2024-2025 బడ్జెట్ కు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సాధరణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేమి ఉండవు. అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న మోదీ రైతులను, మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.