అశాంతి ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వమే దారి, కోబా తీర్థ్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియం ప్రారంభించిన మోదీ..

Advertisements

<p>ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ&comma; అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు&period; మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన సమ్రాట్ సంప్రతి మ్యూజియం ను ఆయన ప్రారంభించారు&period; ఈ మ్యూజియం ఇచ్చే సందేశం కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమని అన్నారు&period; అశోక చక్రవర్తి మనవడు&comma; అహింసా మార్గాన్ని ప్రచారం చేసిన సమ్రాట్ సంప్రతి పేరుతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు&period; దేశవ్యాప్తంగా సేకరించిన జైన సమాజానికి చెందిన అమూల్యమైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు&period; వీటిలో కొన్ని 1000 సంవత్సరాల కంటే పురాతనమైనవి కావడం విశేషం&period; దశాబ్దాల పాటు తమ జీవితాలను అంకితం చేసి&comma; భారతదేశం&comma; నేపాల్ నుంచి ఈ కళాఖండాలను సేకరించిన జైన సన్యాసి ఆచార్య పద్మసాగర్‌ సూరీశ్వర్జీ సేవలను ప్రధాని కొనియాడారు&period;<&sol;p>&NewLine;<p>ఈ మ్యూజియం కేవలం కళాఖండాల భాండాగారం మాత్రమే కాదని&comma; ఇది జైన ఆరాధనకు&comma; సంస్కృతికి&comma; వారసత్వ పరిరక్షణకు ఒక శక్తిమంతమైన కేంద్రమని మోదీ అభివర్ణించారు&period; కోబా తీర్థ్ ఎంతో కాలంగా శాంతికి&comma; ఆధ్యాత్మిక సాధనకు నెలవుగా ఉందని గుర్తుచేశారు&period; ఈ మ్యూజియం రూపకల్పనలో వేదాలు&comma; పురాణాలు&comma; ఆయుర్వేదం వంటి భారతీయ సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని&comma; ఇది మన భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు&period; విద్యార్థులు&comma; పరిశోధకులు ఈ కేంద్రాన్ని పెద్ద సంఖ్యలో సందర్శించాలని ఆశాభావం వ్యక్తం చేశారు&period; జైన తత్వశాస్త్రం&comma; తీర్థంకరుల జీవితాలు&comma; ప్రాచీన తాళపత్ర గ్రంథాలు&comma; ఆలయ నమూనాలు&comma; చారిత్రక కళాఖండాలతో కూడిన ఏడు గ్యాలరీలు ఈ మ్యూజియంలో ఉన్నాయన్నారు ప్రధాని&period; ఇక్కడ సంప్రదాయ ప్రదర్శనలతో పాటు ఆధునిక డిజిటల్&comma; ఆడియో-విజువల్ టెక్నాలజీని మేళవించి సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తున్నారని మోదీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.