దక్షిణాదిలో గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో బస చేసిన ప్రధాని…కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి జగిత్యాలకు బయలుదేరుతారు. అక్కడ గీతా విద్యాలయంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారు. సభ ముగిశాక హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. హైదరాబాద్ నుంచి ప్రధాని కర్ణాకటకు వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. ప్రధాని పర్యటన కోసం సుమారు 1600 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభకు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి బీజేపీ భారీగా జనసమీకరణ చేస్తోంది.
దక్షిణాదిలో కొన్ని రోజులుగా మోదీ సుడిగాలి పర్యటనలు…
83
previous post