102
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను, దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అయినా పొన్నం ప్రభాకర్ సాదాసీదాగా వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.