మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టం(ఎంఎస్ఎంఈడి) 2006 సంవత్సరంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దళిత ఆదివాసి పారిశ్రామికుల ప్రోత్సాహం కోసం వారికి రాయితీలు సడలింపులు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని క్షేత్రస్థాయిలో ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు కానందువల్ల ఆ చట్టం నీరుగారి పోయిందని భారతీయ దళిత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్ర తోట రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమాఖ్య జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షులు నిరుడు రాజు, తెలంగాణ చీఫ్ మెంటల్ అబ్దుల్ లక్ష్మణ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా, ఇతర డిపార్టుమెంటులకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తలు కోలుకోవాలని నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2015-24 మధ్యకాలంలో 3,19,187 కోట్ల విలువైన కొనుగోలు జరగా ఎంఎస్ఎంఈడి చట్టం 2006 నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 19,9,49 కోట్ల కేటాయింపులు జరిగి ఉండాలి కానీ కేవలం 412 కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దక్కినట్లు ఆయన వివరించారు. దీంతో 19537 కోట్ల నిధులు ఫార్వర్డ్ కులాలకు కేటాయించినట్లు తెలిపారు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టర్లు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి తెలంగాణ మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, నీటిపారుదల ప్రధాన కార్యదర్శిలకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కట్టుబడి ఉండి ఎంఎస్ఎంఈడి 2006 చట్టం అమలు చేయాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Read Also…
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టం…
79
previous post