వేములవాడ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Mukkoti Ekadashi celebrations in Vemulawada

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&comma; తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి&period; సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు&period; తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి&comma; శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు&period; కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ&comma; రాష్ట్ర ప్రభుత్వ విప్&comma; ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్&comma; బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.

స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.