కాకినాడ రూరల్ మండలం సూర్యారావు పేట గ్రామంలో జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి సొదే ముసలయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముసలయ్య మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పండుగ వాతావరణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. పండుగ అంటే కోడి పందాలు, గుండు ఆటలు కాకుండా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం ద్వారా గ్రామాల్లో సందడి వాతావరణంతో పాటు వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసిన వారు అవుతామని తెలిపారు. మొదటి బహుమతి మిక్సి, రెండవ బహుమతి గ్యాస్ స్టవ్, మూడవ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గ్లాస్ సెట్ బహుమతులుగా ఇస్తునామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దోనే రమణ, సురాడా శ్రీను, గుబ్బల దుర్గ ప్రసాద్, శివల ఉదయ్ భాస్కర్, గ్రామంలో అధిక సంఖ్య లో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన ముసలయ్య…
85
previous post