కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని ధరిగాం అటవీ ప్రాంతంలో గల మామిడి గుట్ట వద్ద సంవత్సరం నర వయసు గల పులి మృతి చెందినట్టు వైల్డ్ లైఫ్ అధికారి శాంతారామ్ పేర్కొన్నారు. తమ సిబ్బంది పెట్రోలింగ్ లో భాగంగా ట్రాప్ కెమెరాలను పరిశీలించేందుకు వెళ్లగా మృతి చెందిన పులి కాళేబరంను గుర్తించి సమాచారం ఇచ్చారని అన్నారు. స్థానిక అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అందించిన సమాచారం మేరకు తమ బృందంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగిందని అన్నారు. ఓ పశువు కాళేబరాన్ని తినేందుకు రెండు పులులు పరస్పరం దాడి చేసుకోగా ఒక పులి మృతి చెందినట్టు గాయాల ద్వారా తెలుస్తుందని ఎలాంటి విష ప్రయోగం గాని వేటికోసం గాని చంపినట్టు ఆనవాళ్లు లేవని అన్నారు. పులి శరీర బాగాల్లోని అవయవాలను పోస్ట్ మోర్టం ద్వారా సేకరించామని తెలిపారు. మృతి చెందిన పులి వయస్సు సుమారు పదిహేడు నెలలు ఉంటుందని అన్నారు.
పులుల పరస్పర దాడి.. ఆడపులి మృతి
102
previous post