130
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం కురుబ వాండ్లపల్లి సమీపంలో నల్లక్క అనే మహిళ ఆవులు మేపుతుండగా ఒక ఆవు కు తూటా తగలడంతో ఆవు దవడ భాగం పూర్తిగా లేచిపోయిన ఘటన జరిగింది. దీంతో కొన్ని ఆవులు ఆ శబ్దానికి పారిపోగా ఆవు మాత్రం అక్కడ నిలబడిపోవడంతో మహిళ నల్లక్క అక్కడికి వెళ్లి చూడగా ఆవు తూటా నమలడం వలన దవడ భాగం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు పాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నామని ఆవుకు ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు.