87
చంద్రబాబు అరెస్ట్ తో మరణించిన కుటుంబాలను పరామర్శించేదుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు. నందవరం మండలం మాచపురం, ముగతి గ్రామంలో బోయ కొండా హనుమంతు, మాదిగ నాగరాజు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. వారికి మూడు లక్షల రూపాయల చెక్ అందజేశారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు చంద్రబాబు కుటుంబం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఏ కష్టం వచ్చినా తాము ముందు ఉంటామని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.