118
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపుకోటను ఇవాళ అవినీతి కోటగా మార్చేశారని విమర్శించారు. విశాఖలో జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటుంటే, ఇక్కడి ఎమ్మెల్యే రూ.50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని అన్నారు. మన డబ్బులు దోచేసి ఇళ్లు కట్టుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో పోటీ పడుతున్నారని లోకేష్ విమర్శించారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.