మంగళగిరి(Mangalagiri)లో నారా లోకేష్(Nara Lokesh)దే విజయంలోకేష్‌కు ఫుల్ పాజిటివ్ సపోర్ట్ ఇప్పటికే పలుమార్లు సర్వేలు సర్వే రిపోర్టులన్నింటిలో లోకేష్‌కే పట్టం. ఈ విషయం గ్రహించే ఆళ్ల రాజీనామా ఆళ్ల రామకృష్ణారెడ్డికి పూర్తి వ్యతిరేకత ఆళ్లపై ఆగ్రహంగా మంగళగిరి ఓటర్లు సానుభూతికోసమే ఆళ్ల తాపత్రయమంటున్న జనం క్షేత్రస్థాయిలో లోకేష్‌కే పరిస్థితులు అనుకూలం లోకేష్ గెలవడం ఖాయమంటున్న జనం. ఏపీలో మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్‌గా అవుతోంది. ఈసారి మంగళగిరిలో జెండా పాతేది నారా లోకేషే అన్న విషయం స్పష్టమయ్యింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా లోకేష్‌కు ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. ఎన్నికల పర్వం మొదలు కాకముందు నుంచే మంగళగిరిలో పలు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. ఇటు అధికార పార్టీ తరపున, అటు.. ప్రతిపక్ష పార్టీ తరపున కూడా ఎవరికి వాళ్లు తరచూ సర్వేలు నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేల్లోనూ లోకేష్‌కే జనం జై కొడుతున్నారు. లోకేష్‌కే పట్టం కట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోవైపు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గం మొత్తంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాజధాని ప్రాంతమంటూ ఊరించి.. ఊరించి.. తమ ప్రాంత అభివృద్ధి గురించి చేసిందేమీ లేదని జనం పెదవి విరుస్తున్నారు. పైగా ఎన్నికల్లో గెలవగానే వైసీపీ.. మూడు రాజధానుల పల్లవి అందుకొని అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాలను ముందుగా గమనించడం వల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారని చెప్పుకుంటున్నారు. సానుభూతికోసమే ఆళ్ల.. రాజీడ్రామాలు ఆడారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న దశలో కూడా నారా లోకేష్‌కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. వెళ్లిన ప్రతిచోటా ఆదరిస్తున్నారు. దీంతో, లోకేష్ విజయం ఇక నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.