బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ(Delhi), నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. మరోవైపు బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపిన అగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈమెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. నోయిడా-ఘజియాబాద్-ఢిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఐపీ అడ్రస్‌తో ఈమెయిల్ పంపినట్లు అనుమానిస్తున్నారు.
స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని కనుక్కొనేందుకు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఉదయం నుంచి చాలా స్కూళ్లకు ఈమెయిల్స్ వచ్చాయని ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా చెప్పారు. స్కూళ్లను ఖాళీ చేసేశారని అన్నారు. మాకు తెలిసినంత వరకు ఈ మెయిల్స్‌లోని కంటెంట్ అంతా ఒకే మాదిరిగా ఉందని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 151325