ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisements

<p>ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని&period;&period; ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది&period; సీఎం రేఖాగుప్తా ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను గురువారం ప్రకటించారు&period; ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు&period; ఈ నిబంధన రేపటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు&period; అలాగే ఇంధనాన్ని పొదుపుచేసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ సోమవారం&period;&period; మండే మెట్రో నియమాన్ని పాటించాలని సూచించారు&period; మంత్రులు&comma; అధికారులు&comma; ఉద్యోగులంతా తమ సొంత వాహనాలను వదిలి తప్పనిసరిగా మెట్రోలోనే ప్రయాణించాల్సి ఉంటుంది&period; సామాన్య ప్రజలు కూడా వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని విజ్ఞప్తి చేసింది&period; కొత్తవాహనాల కొనుగోళ్లపై ఆరునెలల వరకూ నిషేధం విధించింది&period; పెట్రోల్&comma; డీజిల్&comma; ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును నిలిపివేశారు&period; ఇక ఏడాది కాలంపాటు మంత్రులు&comma; అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..