చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.

చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు

Advertisements

<p>తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు&period; అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌&period;&period;ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు&period; ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి&period;&period;తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి&comma; అపరిశుభ్రతపై వస్తున్న వరుస ఫిర్యాదులు&comma; ఆరోపణల నేపథ్యంలో సీఎం విజయ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు&period; ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నై ఎగ్మూర్‌లోని ప్రముఖ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి&comma; ICHలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; ముఖ్యమంత్రి స్వయంగా వార్డుల్లోకి నడుచుకుంటూ రావడంతో ఆసుపత్రి అధికారులు&comma; సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఆస్పత్రిలోని ప్రతి వార్డును పరిశీలించిన సీఎం విజయ్&period;&period; అక్కడ అందుతున్న వైద్య సేవలు&comma; కల్పిస్తున్న సౌకర్యాలపై రోగులను&comma; వారి కుటుంబ సభ్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు&period; ఆస్పత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉంది&quest; మందులు ఉచితంగా ఇస్తున్నారా&quest; ఎవరైనా లంచాలు అడుగుతున్నారా&quest; అంటూ ఆరా తీశారు&period; ఈ క్రమంలో అక్కడున్న చిన్నారి శిశువులను ఎత్తుకుని ముద్దాడిన సీఎం&comma; బాలింతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను&comma; అందుతున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆస్పత్రి ఆవరణలో&comma; వార్డుల పరిసరాల్లో అపరిశుభ్రత చూసి సీఎం విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు&period; పసిపిల్లలు ఉండే హాస్పిటల్‌ను ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతారా అంటూ అక్కడున్న ఉన్నతాధికారులపై&comma; శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం అందించడం ప్రభుత్వ బాధ్యతని&comma; ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు&period; రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగంలో జవాబుదారీతనం పెంచేందుకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ముందస్తు నోటీసులు లేకుండా తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఈ సందర్భంగా సీఎం విజయ్ స్పష్టం చేశారు&period; సీఎం తాజా చర్యతో తమిళనాడులోని ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.