షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.

షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

Advertisements

<p>భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది&period; హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ &&num;8216&semi;స్కైరూట్ ఏరోస్పేస్&&num;8217&semi; రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ &OpenCurlyQuote;విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది&period; ఈ ప్రయోగానికి &OpenCurlyQuote;మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు&period; ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 11&colon;30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది&period;<&sol;p>&NewLine;<p>స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీంగా తయారు చేసిన పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్ &OpenCurlyQuote;విక్రమ్-1’&period;&period;అంతరిక్ష ప్రయోగాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది&period; ఎందుకంటే భారత గడ్డ పైనుంచి ఒక ప్రైవేట్ కంపెనీ పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగిస్తుండటం ఇదే మొదటిసారి&period; ఇది సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలో మీటర్ల ఎత్తులోని లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరవేయగలదు&period; ఈ మిషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు&period; హైదరాబాద్ స్టార్టప్ &&num;8216&semi;కాస్మోసర్వ్ స్పేస్&&num;8217&semi; తయారు చేసిన స్పేస్ జంక్‌ను తొలగించే &OpenCurlyQuote;మిషన్ ఎంబ్రేస్’ రోబోటిక్ ఆర్మ్ పేలోడ్‌ను కూడా ఇది మోసుకెళ్లనుంది&period; ఇందులో కొన్ని విదేశీ ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లనుంది&period;<&sol;p>&NewLine;<p>ప్రఖ్యాత మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టివాడ రూపొందించిన 18 క్యారెట్ల బంగారు మైక్రో రాకెట్ కూడా ఇందులో అంతరిక్షంలోకి వెళ్లనుంది&period; ఈ చిన్న రాకెట్‌లో భారతీయ శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్&comma; సర్ సివి రామన్&comma; డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం‌à°² మైక్రో ఆర్ట్‌లను ఉంచి గౌరవంగా పంపుతున్నారు&period; ఇందులో మాజీ ఇస్రో చైర్మన్లు&comma; భారతీయ వ్యోమగాములు చేతితో రాసిన పోస్ట్‌కార్డులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>చైన్నైకు చెందిన మరో అంతరిక్ష స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ కూడా అంతరిక్ష రంగంలో అద్భుతం చేయనుంది&period; తమ &OpenCurlyQuote;మిషన్-ఓ2’ ద్వారా భారతదేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఆర్బిటల్-క్లాస్ రాకెట్ బూస్టర్‌ను సురక్షితంగా సముద్రంలోకి దించి&comma; దానిని రికవరీ చేసే భారీ ప్రాజెక్టును ప్రకటించింది&period; ఈ మిషన్ మరో ప్రత్యేకత ఏంటంటే ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ పైభాగం స్పేస్ జంక్‌గా మారిపోకుండా&comma; అక్కడే ఒక పని చేసే లైవ్ ప్లాట్‌ఫారమ్‌గా మారి ప్రయోగాలకు ఉపయోగపడుతుంది&period; కాగా&&num;8230&semi; ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేపథ్యంలో అగ్నికుల్ కాస్మోస్ సంస్థ తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్&period; సోమనాథ్‌ను అబ్జర్వర్‌గా చేర్చుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.