నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

Advertisements

<p>నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది&period; పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు&comma; సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు&period; కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా&comma; పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను అఫిడవిట్‌లో స్పష్టంగా వివరించాలని జస్టిస్ పీఎస్ నరసింహ&comma; జస్టిస్ అలోక్ అరాధేల ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది&period; అదేవిధంగా ప్రతిపాదిత గవర్నింగ్ బోర్డు&comma; నిపుణుల కమిటీలు&comma; డిజిటల్ మౌలిక సదుపాయాలు&comma; భద్రత&comma; పారదర్శకత&comma; పరిశోధన-అభివృద్ధి&comma; మానవ వనరులు సహా 10 ప్రధాన విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల అమలు వివరాలను కోరింది&period; పరీక్షల భద్రత&comma; పర్యవేక్షణ&comma; నిఘా కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ పాత్ర&comma; వారి పనితీరు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించింది&period; పరీక్షకు ముందు&comma; పరీక్ష సమయంలో&comma; పరీక్ష తర్వాత ఇలా ప్రతీ దశలోనూ చేపట్టిన సంస్కరణలపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్‌ను ధర్మాసనం డిమాండ్ చేసింది&period;<&sol;p>&NewLine;<p>ప్రశ్నాపత్రాల ప్రింటింగ్&comma; రవాణా&comma; బహుళ సెషన్ల పరీక్షలు&comma; కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారే ప్రతిపాదనలతో పాటు డేటా భద్రతా చర్యలను కోర్టు కోరింది&period; ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణాకు భారత వైమానిక దళాన్ని ఉపయోగించడం కేవలం తాత్కాలిక చర్యేనని&comma; ఇది శాశ్వత పరిష్కారం కాదని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు&period; పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల తనిఖీ కోసం &OpenCurlyQuote;డిజియాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని కోరింది&period;<&sol;p>&NewLine;<p>అయితే&comma; గత అఫిడవిట్‌లో ఈ విషయాలు సరిగ్గా లేవని కోర్టు వ్యాఖ్యానించగా&comma; కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు&period; &OpenCurlyQuote;మేం దీనిని ఏడాది పొడవునా నిశితంగా పర్యవేక్షిస్తామని&period;&period; సంస్థాగత మార్పులు వచ్చేలా చూస్తామని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.