పొదుపు సూత్రాలు పాటించడం ప్రారంభించిన ప్రధాని మోదీ..

పొదుపు సూత్రాలు పాటించడం ప్రారంభించిన ప్రధాని మోదీ

Advertisements

<p>ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; పొదుపు&comma; ఇంధన పరిరక్షణ దిశగా తన నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు&period; తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు&period; ప్రభుత్వ ఖర్చును తగ్గించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు&period; తన భద్రతా బాధ్యతలు చూసే SPGని ఉద్దేశించి&comma; కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని&comma; అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తితో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి&period; ఢిల్లీ సీఎం రేఖా గుప్తా&comma; రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ&comma; మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వంటి వారు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించారు&period; ప్రభుత్వ స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతూనే&comma; ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు&period; అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు&comma; ప్రపంచ ఆర్థిక అనిశ్చితి&comma; ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు&period; ప్రతిదానికీ దిగుమతులపై ఆధారపడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నిస్తూ&comma; స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు&period; అలాగే ప్రజలు తమ జీవనశైలిలో బాధ్యతాయుతమైన మార్పులు చేసుకోవాలని సూచించారు ప్రధాని మోదీ&period; విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కూడా దేశభక్తితో సమానమని చెబుతూ&comma; ప్రజలు ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు&comma; విదేశీ ప్రయాణాలు&comma; విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు వంటివి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; దీనికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని&comma; వేడుకలను దేశంలోనే జరుపుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..