భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

Advertisements

<p>భారతీయ వ్యాపార దిగ్గజం&comma; అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ&comma; ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది&period; న్యూయార్క్‌లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్&comma; వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ శాశ్వతంగా ఉపసంహరించుకుంది&period; ఆరోపణలను కోర్టులో నిలబెట్టేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్ధారణకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం&period; దీంతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన అదానీ గ్రూప్‌కు సంబంధించిన యూఎస్ నియంత్రణ&comma; న్యాయపరమైన దర్యాప్తులు అన్నీ ముగిశాయి&period; గత వారం&comma; భారత్‌లోని సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి అమెరికా ఇన్వెస్టర్లకు వెల్లడించిన సమాచారం విషయంలో అదానీ&comma; ఆయన సోదరుడి కుమారుడైన సాగర్‌ అదానీపై వచ్చిన ఆరోపణలను యూఎస్‌ ఎస్‌ఈసీ సెటిల్‌ చేసింది&period; కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం&comma; గౌతమ్ అదానీ ఎలాంటి తప్పు చేయలేదని లేదా తప్పు ఒప్పుకోలేదని చెబుతూనే&comma; గౌతమ్‌ అదానీ 6 మిలియన్ డాలర్లు &comma; సాగర్‌ అదానీ 12 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు&period;<&sol;p>&NewLine;<p>ఇదే సమయంలో&period;&period;ఇరాన్ ఆంక్షల ఉల్లంఘనలపై ట్రెజరీ శాఖ దర్యాప్తు వ్యవహారంలోనూ సెటిల్‌మెంట్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు&period; అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ కేసులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2023 నవంబర్ నుంచి 2025 జూన్ మధ్య దిగుమతి చేసిన ఎల్‌పీజీ వాస్తవానికి ఇరాన్‌ నుంచే వచ్చిందని ఓఎఫ్ఏసీ ఆరోపించింది&period; అమెరికా విధించిన ఇరాన్ ఆంక్షలను 32 సార్లు ఉల్లంఘించినట్లు పేర్కొంది&period; ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా ముగించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ 275 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది&period; అయితే దర్యాప్తులో సంస్థ పూర్తిగా సహకరించిందని ఓఎఫ్ఏసీ స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..