పూణేలో కూలిన శిక్షణ విమానం..

పూణేలో కూలిన శిక్షణ విమానం

Advertisements

<p>మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది&period; శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది&period; ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి&period; రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది&period; దీంతో ఉదయం 9 గంటల సమయంలో బారామతి విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది&period; ఈ ల్యాండింగ్‌కి ముందు విమానంలోని కొంత భాగం ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది&period; ప్రమాద సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్‌ మాత్రమే ఉన్నారు&period; ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి&period; క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన వెంటనే స్థానికులు&comma; పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు&period; ఐతే ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం జరిగింది&period; ఆ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..