శత్రు డ్రోన్లను కూల్చేందుకు రూపుదిద్దుకున్న ఇంద్రజాల్‌ రేంజర్‌ ..

శత్రు డ్రోన్లను కూల్చేందుకు రూపుదిద్దుకున్న ఇంద్రజాల్‌ రేంజర్‌

Advertisements

<p>ఆధునిక యుగంలో యుద్ధ తంత్రాలు మారాయి&period; గతంలో భారీ ఆయుధాలు&comma; విమానాలతో యుద్ధాలు జరిగితే&&num;8230&semi; ఇప్పుడు చిన్నపాటి డ్రోన్లు వచ్చి పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి&period; రష్యా&comma; ఉక్రెయిన్‌ యుద్ధంలో డ్రోన్ల ప్రభావం ఎంతలా ఉందో ఇప్పటికే మనం చూస్తున్నాం&period; గత ఏడాది ఆపరేషన్ సింధూర్‌ సమయంలో పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో మనపై డ్రోన్ల దాడికి పాల్పడింది&period; దీన్ని భారత్‌ సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ&period;&period; ఈ రంగంలో మరింత ఆధునాతన వ్యూహాన్ని అవలంభించేందుకు మన దేశం సిద్ధమైంది&period; ఇందులో భాగంగానే ఇంద్రజాల్ రేంజర్‌ అనే యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ రూపుదిద్దుకుంది&period; హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్ డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది&period; ఇది ఒక వాహనానికి అమర్చిన యాంటీ డ్రోన్ సిస్టమ్&period; ఇంతవరకు ఉన్న రక్షణ వ్యవస్థలు ఒకేచోట స్థిరంగా ఉండేవి&period; కానీ ఈ వాహనం వల్ల సరిహద్దుల్లో ప్రయాణిస్తూనే కదులుతున్న శత్రు డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేయడం వీలవుతుంది&period; ఇందులోని రాడార్లు&comma; డైరెక్షన్‌ ఫైండర్లతో కూడిన త్రీ లేయర్ టెక్నాలజీ ఎలాంటి డ్రోన్లను అయినా సులభంగా పసిగట్టగలుగుతుంది&period; దేశంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత పూర్తి మొబైల్ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ఇది&period; ఇంద్రజాల్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే&&num;8230&semi; భారత సరిహద్దు బలగాల పని మరింత సులువు అవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..