బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

Advertisements

<p>దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా&quest; మీ ఇంట్లో&period;&period; అల్మారాల్లో&period;&period; లాకర్లలో పేరుకుపోతున్న బంగారం&comma; ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా&period;&period;&quest; అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్&quest; సామాన్యుడికి దీనివల్ల వచ్చే లాభమేంటి&quest; భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించే ఆ 2&comma;000 టన్నుల మ్యాజిక్ ఏంటి&period;&period;&quest;<&sol;p>&NewLine;<p>భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు&comma; అది ఒక సెంటిమెంట్&period;&period; ఒక భరోసా&period; కానీ&comma; ఆర్థిక భాషలో చెప్పాలంటే ఇది ఒక డెడ్ అసెట్&period; అంటే&comma; అది ప్రజల దగ్గర బంగారం ఉన్నంత కాలం దాని విలువ పెరగొచ్చు కానీ&comma; వినియోగదారులకు నెలనెలా ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు&period; అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది&period; దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ పాలసీని అందుబాటులోకి తేనుంది&period; తద్వారా ప్రజల దగ్గర ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది&period; వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్‌ చేయొచ్చు&period; గతంలో పెద్ద మొత్తంలో ఉన్నవారికే ఈ అవకాశం ఉండేది&period; కానీ ఇప్పుడు కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా ఈ స్కీమ్‌లో చేరే అవకాశం కేంద్రం కల్పించింది&period; డిపాజిట్‌ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2&period;5శాతం వరకు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p>వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంను 2015లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం&period;&period; ఇప్పుడు బంగారం దిగుమతిని అడ్డుకోవడం&comma; భారతీయుల దగ్గర నిరుపయోగంగా ఉన్న నిల్వ ఉన్న బంగారాన్ని వెలికి తీయడం వంటి రెండు అంశాలను దృష్టి పెట్టుకొని ఓ ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు&period; ఈ స్కీంలో భాగంగా ప్రజలు&comma; సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక ప్రయోజకోసం ఉపయోగించేలా చేయడం&comma; బంగారం దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది&period; ఇందులో రెండు రకాల స్కీంలు ఉన్నాయి&period; ఒకటి బంగారం డిపాజిట్ పథకం&comma; రెండోది బంగారు లోహ రుణం&period; అప్పట్లో బంగారం సేకరించేందుకు ఇది ఒక గొప్ప ప్రయత్నంగా భావించబడినప్పటికీ&comma; వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమైంది&period; దేశ ప్రజలనుంచి 34వేల టన్నుల బంగారం సేకరించాలని టార్గెట్ పెట్టుకోగా కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సమీకరించగలిగింది&period;<&sol;p>&NewLine;<p>భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్&period; ప్రతి సంవత్సరం సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది&period; 2026 ఆర్థిక సంవత్సరంలో అయితే మన బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి&period; అయిదు నెలల కాలంలో 24 శాతం పెరిగాయి&period; దీంతో దేశానికి సుమారు 72 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నష్టం వాటిల్లింది&period; ఈ నేపథ్యంలో విదేశీ మారకం నిల్వ తగ్గుదలను అడ్డుకునే యోచనలో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీం మళ్లీ తెరపైకి వచ్చింది&period; పదేళ్లపాటు అమలులో ఉన్న ఈ స్కీంలో కొంత భాగం నిలిపివేశారు&period; అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీంను పునరుద్దరించి బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది&period; అందుకే గతంలో ఉన్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు భారీ మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం సుమారు 30వేల టన్నులు ఉంటుందని ఓ అంచనా&period; దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది&period; రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు&period; ఈ నేపథ్యంలో కనీసం 2&comma;000 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం&period; ఈ 2&comma;000 టన్నులు గనుక డిపాజిట్ అయితే&comma; రాబోయే 3 ఏళ్ల పాటు భారత్‌కు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు&period; అయితే ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది&period;<&sol;p>&NewLine;<p>ప్రజలు డిపాజిట్ చేసిన బంగారాన్ని బ్యాంకులు జువెలరీ తయారీ సంస్థలకు లేదా ఎగుమతి యూనిట్లకు లీజుకు ఇస్తాయి&period; దీనివల్ల మార్కెట్లో కొత్త బంగారం లభ్యత పెరుగుతుంది&period; డాలర్ వినియోగం తగ్గుతుంది&period; తద్వారా రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది&period; అంతేకాకుండా కరెంట్ ఖాతా లోటు కూడా భారీగా తగ్గుతుంది&period; అయితే ఈ స్కీమ్ గతంలోనే అమల్లోకి తెచ్చినా&period;&period;ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు&period; అందుకు చాలా కారణాలే ఉన్నాయి&period; వారసత్వంగా వచ్చిన బంగారాన్ని కరిగించడానికి ప్రజలు ఇష్టపడడంలేదు&period; అప్పట్లో వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా లేవు&period; ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్‌పై ప్రజల్లో అవగాహన లేదు&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేంద్రం ఈ సారి మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తోంది&period; మెరుగైన వడ్డీ రేట్లు&comma; డిజిటల్ ట్రాకింగ్&comma; అధిక భద్రత&comma; సులభతరమైన డిపాజిట్ ప్రక్రియ ద్వారా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తోంది&period; తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని భావిస్తోంది&period; మొత్తానికి ప్రజల లాకర్లలో పేరుకుపోతున్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారే అవకాశం కనిపిస్తోంది&period; అయితే&comma; భారతీయులు తమ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి బంగారాన్ని బ్యాంకులకు ఇస్తారా&quest; మోదీ సర్కార్ తెస్తున్న ఈ కొత్త నిబంధనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తాయా&quest; అనేది వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..