దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికల(General Elections 2024)కు నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్(Polling)కు ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) చేసింది ఈసీ. మూడో దశలో మొత్తం 94 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, దాద్రనగర్ హావేలి, డామన్ డయ్యు, గుజరాత్, గోవా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, లోక్ సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి.
ఇది చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్..!
కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. ఇంతకు ముందే తొలి రెండు దశల ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేస్తుంది. 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పనిచేస్తారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వాడనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.