నేవీ చేతికి సరికొత్త డ్రోన్..!

new drone

Advertisements

&NewLine;<p>భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది&period; సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దృష్టి డ్రోన్ ను చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆవిష్కరించారు&period; నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవరహిత వైమానిక వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించామని వివరించారు&period; ఈ డ్రోన్ తో నౌకాదళ నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని అడ్మిరల్ హరికుమార్ తెలిపారు&period; హైదరాబాద్ లోని అదానీ ఎరోస్పేస్ పార్క్ లో ఆయన మాట్లాడుతూ ఇంటెలిజెన్స్&comma; నిఘా&comma; గూఢచర్య కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు&period; సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు&period; ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందన్నారు&period; దృష్టి డ్రోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఏకధాటిగా 36 గంటల పాటు గాలిలోనే ఉంటూ నిఘా పెట్టగల సామర్థ్యం దీని సొంతం&period; దీంతోపాటు 450 కిలోల వరకు పేలోడ్ ను మోసుకెళ్లేలా ఈ డ్రోన్ ను డిజైన్ చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది&period; సముద్ర జలాలపై వాతావరణ మార్పులను తట్టుకుంటూ&comma; ఎలాంటి వాతావరణంలోనైనా గాల్లోకి లేచేలా ఈ డ్రోన్ ను తయారు చేసినట్లు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..