బీఆర్ఎస్ భారీ కసరత్తు…

Brs Warangal Parliament Constituency Review Meeting

Advertisements

&NewLine;<p>వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది&period; వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్&comma; వరంగల్ ఈస్ట్&comma; స్టేషన్ ఘన్ పూర్&comma; పరకాల&comma; పాలకుర్తి&comma; వర్ధన్నపేట&comma; భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష జరగనుంది&period; ఈ సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&comma; హరీష్ రావు&comma;<br>కడియం శ్రీహరి&comma; ఎర్రబెల్లి దయాకరరావు&comma; ఎంపీ పసునూరి దయాకర్&comma; తదితరలు హాజరుకానున్నారు&period; 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ విజయం సాధించింది&period; ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది&period; వరంగల్ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమవడంతో అంతా ఆశ్చర్యపోయారు&period; సిట్టింగ్ ఎంపీగా వున్న పసునూరి దయాకర్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ దక్కక పోవచ్చనే ప్రచారం జరుగుతుంది&period; బిఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య&comma; కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉండనున్నారు&period; వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్&comma; బిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది&period; సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.