రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan) పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం. ఈనెల 14వ తేదీ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎమ్మెల్సీ శివరాం రెడ్డి గారి తల్లి భౌతికకాయాన్ని సందర్శించడానికి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఒక హెలికాప్టర్ టేక్ ఆఫ్ – మరియు లాండింగ్ సమయంలోనూ హెలికాప్టర్ తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ముఖ్యమంత్రి హెలికాప్టర్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ హెలిపాడ్ పై దిగుతున్న సందర్భంగా విజువల్స్ లో ఒక చీపురు గాలిలోకి ఎగిరి కింద పడడం కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఆ చీపురు ఇంకాస్త పైకి ఎగిరి పైన తిరుగుతున్న రోటర్ కు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదే, అలా ఏమి జరగలేదు కాబట్టి ఎవరు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు కానీ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిపాడ్ నిర్వహించిన తీరు, తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. హెలిపాడ్ ఏర్పాటు చేయడానికి ఎంత తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇలాంటి ఒక నిర్లక్ష్యం తీవ్రంగా ఖండించదగినదే.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి