95
పశ్చిమ గోదావరి జిల్లా ( West Godavari )లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ను మంత్రి సందర్శించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు అని చెప్పారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.