ఎస్ఈ మూర్తి వ్యవహార శైలి పై కార్యాలయ సిబ్బంది నిరసన..

Staff protest against SC Murthy

Advertisements

&NewLine;<p>జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు &lpar;ఎస్&period;ఈ&rpar; మూర్తి వ్యవహార శైలి పై పంచాయతీరాజ్ ఇంజనీర్లు&comma; కార్యాలయ సిబ్బంది నిరసన తెలిపారు&period; ఎస్ఈ కార్యాలయం ముందు రాత్రి బయటాయించి ఆందోళన చేపట్టారు&period; ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు కేసిహెచ్ మహంతి మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ విషయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఎప్పుడో 2019 నాటి వ్యయంతో ఇప్పుడు నిర్మాణాలు నిర్మించాలంటే ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించారు&period; ఇప్పుడు భవన నిర్మాణ సామాగ్రి రేట్లు విపరీతంగా పెరిగాయి&comma; కూలీ రేట్లు పెరిగాయి&comma; అయినా వాటిని పెంచకుండా నిర్మాణాలు కొనసాగించాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు&period; జగన్ ఇల్లు నిర్మాణాలు&comma; రైతు భరోసా కేంద్రాలు&comma; సచివాలయాలు సకాలంలో నిర్మించకపోతే మీపై చర్యలు తీసుకుంటామని అధికారులు&comma; జిల్లా కలెక్టర్ మమ్మల్ని వేధించడం తగదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు&period; గత వారం రోజులుగా తమ బాధలను వినాలని జిల్లా పరిషత్ ఆఫీసు వద్దకు వస్తే ఎస్ఈ దొరకటం లేదని ఆరోపించారు&period; వారానికి ఒకరోజు కార్యాలయానికి రాని ఎస్ఈ వైఖరితో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు&period; ఇప్పటికే ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేశారని&comma; ఇంకా అందరిపై కూడా వేటు వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు&period; తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..