75
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీ లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచుల పదవీ కాలం ముగిసినందున, వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read Also..