ఆధునిక హంగులతో ఆర్టిసి బస్ స్టాండ్…

YCP

Advertisements

&NewLine;<p>ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; ఆర్టీసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో బస్టాండ్ లో సుమారు 2&period;5 కోట్లతో నూతనంగా నిర్మించిన బస్టాండ్ విస్తరణ నిర్మాణాలను ఆర్టీసి అధికారులు&comma; వైకాపా నేతలతో కలిసి వారు ప్రారంభించారు&period; వీరికి ఆర్టీసి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు&period; మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాలువాలతో సత్కరించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ ప్రాంగణం బస్సుల రవాణాకు&comma; ప్రయాణీకుల సౌకర్యాలకు ఇబ్బందిగా ఉందని గుర్తించి&period;&period; అదనపు బస్ స్టాండ్ నిర్మాణానికి రూ 2&period;50 కోట్లు నిధులును మంజూరు చేయించామన్నారు&period; బస్ స్టాండ్ ప్రాంతాన్ని విస్తరించడంతో పాటు ఆధునిక వసతులతో భవనం&comma; ఫ్లాట్ ఫార్మ్స్ విస్తరణ&comma; లైటింగ్ లతో కూడిన సూచిక బోర్డులు&comma; వర్టీకల్ టైల్స్&comma; టాయిలెట్స్&comma; ప్రహరీ గోడ ప్రయాణీకులకు సౌకర్యాల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులు తీర్చి దిద్దడం జరిగిందన్నారు&period; దీంతో ప్రయాణీకుల ప్రాంగణం నగరాలలోని బస్ స్టాండ్ లకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు&period; అదే విధంగా కడప- రాయచోటి&comma; రాయచోటి- తిరుపతి కి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్